-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Important instructions for SBI ATM card holders

Important instructions for SBI ATM card holders
మీకు SBI ATM ఉంటే మీరు ఖచ్చింతంగా తెలుసుకోవలసిన 12 సూత్రాలు ఇవే...             
దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆఫర్లు, వివిధ రకాల కార్డులను అందిస్తోంది. నగదు ఉపసంహరణ పరిమితి విషయంలో కూడా ఎస్‌బీఐ ఎన్నోరకాల కార్డులను వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కో కార్డుకు ఒక్కో పరిమితితో ఆఫర్లను అందిస్తోంది. కానీ SBI ఎటిఎం ఉన్న ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
👉1. మీరు ఎటిఎం తీసుకోగానే ముందుగా దాని వెనుక వైపు భాగంలో సంతంకం చేయాలి.
👉2. మీ ఎటిఎం పిన్ నెంబర్ అప్పుడప్పుడు మారుస్తుండాలి.
👉3. ఎటిఎం మీద ఎప్పుడు మీ పిన్ నెంబర్ రాయరాదు.
👉4 ఎవరన్నా మీకు కాల్ చేసి మీ కార్డు పిన్ నంబర్లు అడిగితే చెప్పరాదు.
👉5 మీరు ఎటిఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు లోపకి ఎవరిని రానీయద్దు.
👉6.పిఓఎస్ మిషన్ లేదా స్వైపింగ్ మిషన్ మీరు వాడేటప్పుడు మీ పిన్ నెంబర్ ఎవరికీ కనపడకుండా చూసుకోవాలి.
👉7.మీరు ఎటిఎంలో డబ్బు విత్ డ్రా చేసుకున్నాక స్లిప్ వస్తుంది అది అక్కడే పడేయకూడదు ఎందుకంటే దాంట్లో మీ అకౌంట్ కి సంబందించిన వివరాలు ఉంటాయి, కానీ ఈరోజుల్లో చాలామంది అక్కడే పడేస్తుంటారు జాగ్రత్తగా ఉండాలి.
👉8. ఎటిఎంలో గ్రీన్ కలర్ లైట్ వచ్చేవరకు మీరు మిషన్ లో కార్డు పెట్టకూడదు.
👉9 ఈరోజుల్లో చాలామంది ఎక్కడికి వెళ్లిన కార్డు స్వైప్ చేస్తున్నారు మీరు హోటళ్లకు మరియు షాపింగ్ కు ఎక్కడికి వెళ్లిన మీ ముందరే కార్డు స్వైప్ చేయమని చెప్పండి.
👉10. తాత్కాలిక స్టాల్ల్స్ లో అనవసరంగా కార్డు స్వైప్ చేయకండి.
👉11. మీరు చేసే ప్రతి లావాదేవీ మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ వచ్చేలాగా చూసుకోండి అందుకోసం మీ బ్యాంకులో మొబైల్ నెంబర్ ఇవ్వండి.
👉12. ఒకవేళ మీ ఎటిఎం కార్డు పోతే వెంటనే 1800 425 3800 లేదా 1800 11 22 11 ఫోన్ చేసి మీ కార్డును బ్లాక్ చేయించండి.

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download