Mid Day Meal - Eggs tender authorities to DEOs
గుడ్డు టెండర్ల బాధ్యత జిల్లా విద్యాధికారులకు అప్పగించేందుకు ప్రతిపాదనలుమధ్యాహ్న భోజన పథకానికి కోడిగుడ్ల సరఫరా టెండర్ల బాధ్యతలను జిల్లా విద్యాధికారులకు అప్పగించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
గతంలో రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలకు సరఫరా బాధ్యతలు అప్పగించగా.. నాణ్యతలేని గుడ్లు సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు ఈ బాధ్యతలు జిల్లాలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కోడిగుడ్ల సరఫరాకు గతేడాది రాష్ట్రస్థాయిలో పిలిచిన టెండర్ల గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. గత నెలలో కొత్త టెండర్లు పిలిచినా.. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31 వరకు పాత గుత్తేదార్లే కోడిగుడ్లు సరఫరా చేయనున్నారు.
కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. జిల్లాలవారీగా టెండర్లు నిర్వహించి, గుత్తేదార్లను ఎంపిక చేసే వరకు పాఠశాలల్లోని వంట ఏజెన్సీలే (వచ్చే నెల 1 నుంచి) కోడిగుడ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సైతం పాఠశాలల నుంచే ఆహారం అందిస్తున్నారు.
ఈ పథకంలో లబ్ధిపొందుతున్న పాఠశాలల విద్యార్థులు: 34,57,124, జూనియర్ కళాశాలల విద్యార్థులు: 1.75 లక్షలు,
వారానికి ఒక్కొక్కరికి ఇస్తున్న కోడిగుడ్లు: 5.