NMMS scholarship తాజా పత్రికా ప్రకటన
నవంబరు 2017 లో నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములను 31-10-2018 లోపు నమోదు చేసుకొనవలెను, లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని జాతీయ మానవ వనరుల శాఖ వారు తెలియజేసారు మరియు నవంబరు 2014, 2015, 2016 సంవత్సరములలో ఎంపిక కాబడి, గత సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ విద్యార్ధి తప్పకుండా ఈ సంవత్సరం 15-10-2018 లోపు రెన్యువల్ చేసుకొనవలెను,కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్థి ఎట్టి పరిస్థితులలోనూ పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు.ఎంపిక కాబడి ఇంతవరకూ పోర్టల్ నందు నమోదు చేసుకొనని అభ్యర్థులు తమ పూర్తి వివరములతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు వెంటనే సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.