What to do if we got fake note in bank atm
బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకున్న తర్వాత చాలా మంది నోట్లను లెక్కించకుండానే పర్సులో పెట్టేసుకుంటారు. బ్యాంక్, ఏటీఎంలపై కస్టమర్లకు ఉన్న విశ్వాసమే ఇందుకు కారణం. ఒకవేళ ఆ నోట్లలో ఒక నకిలీ నోటు వస్తే పరిస్థితి ఏంటి? ఏం చేయాలి అన్న సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. ఒకవేళ నకిలీ నోటు వస్తే ఏం చేయాలంటే..ఏటీఎం నుంచి నగదు తీసుకున్న తర్వాత కచ్చితంగా నోట్లను లెక్కించాలి. ఆ నోట్లు సరిగ్గా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి.
ఒకవేళ ఏదైనా ఒక నోటుపై సందేహం వస్తే ఏటీఎంలో ఉన్న సీసీ టీవీ కెమెరా ముందు ఆ నోటును ప్రదర్శించాలి. ఆ నోటును బ్యాంకు వద్ద మార్చుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తే.. సీసీ టీవీ ఫుటేజ్‌ను చూడాల్సిందిగా సూచించవచ్చు.
ఏటీఎంలో లావాదేవీ జరిపినప్పుడు వచ్చిన రిసీట్ కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలి. పేపర్‌లెస్ లావాదేవీ చేస్తే లావాదేవీ తర్వాత వచ్చిన మెసేజ్‌ను సేవ్ చేసి ఉంచుకోవాలి.
ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. అప్పుడు లావాదేవీకి సంబంధించిన స్లిప్‌ను చూపి కొత్త నోటును తీసుకోవచ్చు.
నకిలీ నోట్ల చలామణి చట్టరీత్యా నేరం. జైలు శిక్షకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నకిలీ నోటు ఏటీఎం నుంచి వస్తే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని దాన్ని బ్యాంకు ద్వారా మార్చుకోవాలి.