Income Tax Department alert message:
*✨ పన్ను చెల్లింపుదారులారా.. జాగ్రత్త!*
*✨ పన్ను చెల్లింపుదారులారా.. జాగ్రత్త!*
- మీ ట్యాక్స్ రీఫండ్ చేస్తాం. మీ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ నెంబరు చెప్పండి. ట్యాక్స్ రీఫండ్ కింద నగదు మొత్తం మీ ఖాతాలోకి వచ్చి చేరుతుంది’ అని ఓ లింక్ పంపుతూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించినట్లుగా ఈమెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ వస్తున్నాయా.
- ఇదంతా నిజమే అనుకొని మీ వివరాలు చెప్పారా? ఇక అంతే సంగతులు. వెంటనే మీ కార్డు వివరాల ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదునంతా ఊడ్చేస్తున్నారు.
- ఖాతాదారుల వివరాలు తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా ఉచ్చు పన్నుతున్నారు.
- ఇటువంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఐటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
- ‘ఐటీ శాఖ పంపిస్తున్నట్లుగా వస్తున్న నకిలీ సందేశాల పట్ల జాగ్రత్త వ్యవహరించండి.
- ట్యాక్స్ రీఫండ్ ప్రక్రియలో భాగంగా మేము మీ డెబిట్, క్రెడిట్ కార్డు, సీవీవీ నెంబరు ఎన్నటికీ అడగబోము. మీ కార్డు వివరాలను ఎవరితోను పంచుకోవద్దు’ అంటూ ఐటీశాఖ సామాజిక మాధ్యమాల ద్వారా ఖాతాదారులను హెచ్చరించింది.
- ట్యాక్స్ రీఫండ్ కోసం కొంతమంది వాటిని నమ్మి వివరాలను అందజేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- రీఫండ్ ప్రక్రియ కోసం కేవలం బ్యాంకు వివరాలు ఉంటే చాలు, డెబిట్ కార్డు వివరాలు అవసరం లేదని, ఇటువంటి నకిలీ సందేశాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఐటీ అధికారులు సూచించారు.