-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Income Tax limit likely to be increased from 2.5lakh to 5lakh

వ్యక్తుల ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఓటాన్ అకౌంట్ సందర్భంగా దీనిపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతవ రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై వ్యక్తిగత ఆదాయప పన్ను లేదు. రూ.2.5-5 లక్షల వరకు ఆదాయంపై 5%, రూ.5-10 లక్షల ఆదాయంపై 20%, రూ.10 లక్షలపైబడిన ఆదాయంపై 30% పన్ను విధిస్తున్నారు. పరోక్ష పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవలే ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ కూడా ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసి రూ.5 లక్షలు చేయాలని కోరింది. అలాగే పొదుపులను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 80సి కింద తగ్గింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వశాఖకు బడ్జెట్ ముందు ఇచ్చే సలహాల్లో భాగంగా సీఐఐ, అత్యధిక వ్యక్తిగత ఆదాయ పరిమితిని 30% నుంచి 25% చేయాలని సూచించింది. వైద్య ఖర్చులు, రవాణా భత్యాలపై మినహాయింపు ఇవ్వాలని చెప్పింది. రూ.5-10 లక్షల ఆదాయంపై 10%, రూ.10-20 లక్షల ఆదాయంపై 20%, రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై 25% పన్ను విధించాలని సిఫార్సు చేసింది.

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download