EBC 10% reservation news, conditions and eligibility అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ _ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
- అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర.
- అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్ వెల్లడి.
- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది.
- కేబినెట్ నిర్ణయంతో జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.
- రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది.
To get 10% reservations for EBCs the conditions are:
- సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
- నివాసం 1,000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి.
- నోటిఫై చేసిన పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం ఉండాలి.
- నోటిఫై కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలంలో నివాసం ఉండాలి.