*🎯ఎస్ ఏ 1 పరీక్షల నిర్వహణపై పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ముఖ్య సూచనలు* Ⓜ️పరీక్షల టైం టేబుల్ విద్యార్థులందరికీ స్పష్టంగా తెలియజేయండి. Ⓜ️ప్రశ్నా పత్రాలను ఏరోజుకారోజు పరీక్ష ప్రారంభ సమయానికి ఒక గంట ముందు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము నుండి తీసుకుని వెళ్లి పరీక్షలు నిర్వహించాలి. Ⓜ️టైం టేబుల్ నందు పేర్కొనిన తరగతులకు పేర్కొనిన సమయంలో పరీక్షలు నిర్వహించాలి. Ⓜ️పరీక్షలు పూర్తైన వెంటనే ఉపాధ్యాయులు వారి వారి సబ్జెక్టులలో కీ స్వయంగా తయారుచేసుకుని జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్ లందు నమోదు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోపల స్టూడెంట్ ఇన్ఫో సైట్ నందు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. Ⓜ️జవాబు పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి. Ⓜ️విద్యాదులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదు చేసి 09.12.2023 తేదీన తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటుచేసి ప్రోగ్రెస్ కార్డులను వారికి అందివ్వాలి. Ⓜ️పరీక్షలలో తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలి. ఉపాధ్యాయుల సమీక్షా సమావేశంలో మరియు పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎస్ ఏ 1 నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.